Advertisement
Google Ads BL

బెల్లంకొండ-రష్మిక కొత్త కథ


రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో కలిసి స్నేహం చేస్తుందో? డేటింగ్ చేస్తుందో? కనిపెట్టలేక మీడియా ఇప్పటికి గింజుకుంటూనే ఉంది. రష్మిక-విజయ్ స్నేహితులమని చెబుతూనే వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉండడం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పుడు అదే రష్మిక బెల్లంకొండ శ్రీనివాస్ తో డేటింగ్ చేస్తుంది అంటూ మరో వార్త ప్రముఖంగా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కువగా ముంబైలో కనబడుతున్నాడు. 

Advertisement
CJ Advs

కారణం ఛత్రపతి రీమేక్ విడుదల కోసం ప్రమోషన్స్ చేస్తూ తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కుతున్నాడు. అయితే రష్మిక-బెల్లంకొండ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే వీళ్ల మధ్య ఏదో ఉందనే రూమర్ మొదలైంది. తాజాగా బెల్లకొండ ఛత్రపతి ప్రమోషన్స్ లో రష్మిక తనకి మంచి ఫ్రెండ్ అని, కానీ తనని కలవడానికి టైం దొరకడం లేదని.. ఏదో ఒకటిరెండుసార్లు కలిసి కనబడితే డేటింగ్ రూమర్స్ అల్లేస్తారా.. అసలు నేను రష్మిక కలిసి ప్రయాణించించే లేదు.. అవన్నీ జస్ట్ రూమర్స్ అంటూ కొట్టి పారేసాడు.

కానీ రష్మిక తో బెల్లంకొండ డేటింగ్ అనగానే ఆటోమాటిక్ గా బెల్లకొండ పేరు పాపులర్ అయ్యింది. ఎంతగా ఛత్రపతి రీమేక్ చేసి హిందీలో దించుతున్నా అక్కడ బెల్లంకొండపై అంత క్రేజ్ కనిపించడం లేదు. కానీ రష్మిక మేటర్ తో అతను బాగా ఫెమస్ అయ్యాడు. సో రష్మిక-బెల్లకొండ కథ అదే. రష్మిక ప్రస్తుతం షూటింగ్స్ కోసం హైదరాబాద్ టు ముంబై అంటూ తిరుగుతూ ఎక్కే ఫ్లైట్ ఎక్కుతుంది, దిగే ఫ్లైట్ దిగుతుంది.

Bellamkonda-Rashmika New Story:

Sreenivas Bellamkonda finally reacts to Rashmika dating rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs