Advertisement
Google Ads BL

ఇకపై వైసీపీ టార్గెట్ జగ్గు భాయ్


సూపర్ స్టార్ రజినీకాంత్ ఏపీ వెళ్లి అక్కడ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని పొగడడం వైసిపి ప్రభుత్వానికి సుతరామూ నచ్చలేదు. సీఎం జగన్ ని కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ రజినికాంత్ ఒక్కమాట అనలేదు. కానీ చంద్రబాబు నాయుడిని పొగడడమే వాళ్ళకి నచ్చక రజినీకాంత్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. రాజకీయాలకి సంబంధం లేని ఓ వ్యక్తిని వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేయడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రజినీకి సారి చెప్పాలంటూ డిమాండ్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ కి సపోర్ట్ గా ఎవరూ మాట్లాడలేదు. ఎవ్వరు రజినీకి సపోర్ట్ చేసినా జగన్ ప్రభుత్వం నుండి సినిమాల విషయంలో చిక్కులు ఎదుర్కోవాలని తెలుసు. ఇప్పటికే బడా నిర్మాత అశ్విని దత్ వైసీపీ వాళ్ళని గూండాలు, రౌడీలు అన్నారని ఇకపై అశ్విని దత్ సినిమాలని ఏపీలో ఆడనివ్వరంటూ బ్లూ మీడియా అప్పుడే ఆయన్ని బెదిరించడం మొదలు పెట్టాక.. రజినికి సపోర్ట్ గా ఎవరు నిలబడతారు.

కానీ ఈరోజు రామ బాణం ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు, ఆయన నిజాలే మాట్లాడతారంటూ రజినీకి స్టాండ్ తీసుకోవడం చూస్తుంటే ఇకపై జగపతి బాబు సినిమాలు కూడా ఏపీలో ఆడనివ్వరేమో అనే కామెంట్స్ మొదలయ్యాయి. జగపతి బాబు హీరోగా సినిమాలు చెయ్యడం లేదు, ఆయన విలన్స్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రజినీకాంత్ కి సపోర్ట్ చెయ్యడం చూస్తే వైసిపి ప్రభుత్వం వాళ్ళు ఆయన్ని కూడా టార్గెట్ చేస్తారేమో చూద్దాం.

Will you target Jaggu Bhai now?:

Now YCP target Jagapathi Babu?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs