Advertisement
Google Ads BL

షూటింగ్ లో చియాన్ విక్రమ్ కి ప్రమాదం


గత కొంతకాలంగా సక్సెస్ కి దూరమైన చియాన్ విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సక్సెస్ తో జోష్ మీదున్నారు. విక్రమ్ రకరకాల గెటప్స్ , రకరకాల కాస్ట్యూమ్స్ తో పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో హడావిడి చేశారు. ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభిత దూళిపాళ్లతో కలిసి స్పెషల్ జెట్ లో ప్రమోషన్స్ లో సందడి చేసిన విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 2  హిట్ చేసిన ప్రేక్షకులకి సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పారు.  డిఫరెంట్ గెటప్స్ కి విక్రమ్ పెట్టింది పేరు. 

Advertisement
CJ Advs

పొన్నియన్ సెల్వన్ సక్సెస్ తర్వాత ఇమ్మిడియట్ గా ఆయన చేస్తున్న తంగలాన్ షూటింగ్ స్పాట్ కి వెళ్లిపోయారు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్-పార్వతి-మాళవిక మోహనన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే అందరిని ఇంప్రెస్స్ చేసింది టీం. అయితే మరో రెండు రోజుల్లో తదుపరి షెడ్యూల్ మొదలుకాబోతున్న తరుణంలో టీం మొత్తం రిహార్సల్స్ లో పాల్గొంటుంది. ఈ రిహార్సల్స్ లో విక్రమ్ కి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. 

ఈ ప్రమాదంలో విక్రమ్ కి పక్కటెముక విరగ్గా చిత్ర బృందం వెంటనే ఆయన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేసిన వైద్యులు విక్రమ్ కి ఆపరేషన్ చెయ్యాల్సి ఉంటుంది, అలాగే కొన్నాళ్ళపాటు రెస్ట్ లో ఉండాల్సి ఉంటుంది అని సూచించినట్లుగా తెలుస్తుంది. అటు మేకర్స్ కుడా విక్రమ్ పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట.

Chiyaan Vikram suffers rib injury at rehearsals:

Vikram suffers rib injury during rehearsals for Pa Ranjith Thangalaan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs