Advertisement
Google Ads BL

వైరల్ : NTR30 ఫ్యాన్ మేడ్ పోస్టర్


#NTR30 షూటింగ్ మొదలైనప్పటినుండి కొరటాల శివ శరవేగంతో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా సినిమా మొదలయ్యాక ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ కి వచ్చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ కలయికలో కీలక సన్నివేశాల చిత్రీకరణలో కొరటాల బిజీగా వున్నారు. సైఫ్ అలీ ఖాన్ వైఫ్ గా సీరియల్స్ నటి చైత్ర రాయ్ నటిస్తుండగా.. #NTR30 నుండి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఏమి రాబోతుందో అంటూ ఫాన్స్ అంతా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

#NTR30 టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రావడం పక్కా అంటూ ఈరోజు ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి #NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ ఫుల్ అప్ డేట్ ఆన్ ద వే అని, #NTR30 అప్ డేట్ లోడింగ్ అంటూ హడావిడి చెయ్యడమే కాదు.. కొంతమంది ఫాన్స్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.. అందులో పెద్ద ఎన్టీఆర్ లుక్ ఆయన బర్త్ డే కి రాబోతుంది అంటూ హంగామా మొదలు పెట్టేసారు.

ఇక ఎన్టీఆర్ అభిమాని ఒకరు కొరటాల సినిమాలో పెద్ద ఎన్టీఆర్ లుక్ ఇలా ఉంటుంది అంటూ జీప్ మీద కూర్చుని వైట్ పంచె కట్టి, కాలు మీద కాలు వేసుకుని ఒక చేతిలో గన్ పట్టుకుని, మరో చేతితో సిగరెట్ వెలిగిస్తున్న పిక్ ని డిజైన్ చేసి ట్రెండ్ చేస్తుండగా.. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

NTR 30 Fan Made Poster Viral:

NTR 30 Fan Made Poster goes viral in social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs