Advertisement
Google Ads BL

అశ్విని దత్ కి బెదిరింపులు స్టార్ట్


అశ్విని దత్ నిన్న వైసిపి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకి బెదిరింపులు మొదలైపోయాయి. వైసిపి అనుకూల మీడియా వాళ్ళు అశ్విని దత్ ని టార్గెట్ చేసారు. ముందుగా పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టాడు. నీ బతుకు నాకు తెలుసు అంటూ మొదలు పెట్టాడు. ఇక వైసిపీ అనుకూల మీడియా అయితే మీ ప్రాజెక్ట్ K వస్తుంది చూసుకోండి అంటూ మొదలు పెట్టేసింది. ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ K వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అంటూ అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

వైసిపీ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యల ఫలితం ఎలా ఉంటుందో చూడండి అని ఆల్మోస్ట్ బెదిరించడానికి రెడీ అయ్యింది. అశ్విని దత్ కి మట్లాడడం రాదు.. అందుకే ఆయన కూతుళ్లు ఆయన్ని ఎక్కువగా మాట్లాడనీయకుండా చూస్తారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈయన ఇలాంటిది ఏదో ఒకటి మాట్లాడతారు. అటు అన్ని మంచి శకునములే అని చిన్న సినిమా తీసి విడుదల చేస్తున్న క్రమంలో ఇలాంటి మాటలు మట్లాడారు. అది చిన్న సినిమా కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద బడ్జెట్ సినిమా అయితే ఆంధ్రలో ఇబ్బంది అయ్యేది అంటూ రాసేశారు. 

అంటే వైసిపీ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళ సినిమాలు ఆడనివ్వరు, థియేటర్స్ ఇవ్వకుండా, టికెట్ రేట్స్ తగ్గించేసి ఇబ్బంది పెట్టేస్తారు జర చూసుకుని మట్లాడండి అనేగా దానర్ధం. చిన్న సినిమా కాబట్టి సరిపోయింది.. అదే ప్రాజెక్ట్ K అంటే బెన్ ఫిట్ షోస్ కి అనుమతి దొరికేది కాదు, అదనపు ఆటలు వేసే అనుమతి వచ్చేది కాదు.. అప్పుడు ప్రభుత్వం అవన్నీ కట్టడి చేసేస్తుంది అంటూ బెదిరించడం దేనికి సంకేతం. 

అయితే ప్రాజెక్ట్ K ఇప్పుడు విడుదలైన పెద్దగా సమస్య ఉండదు.. అక్కడ అశ్విని దత్ కన్నా ప్రభాస్, ఆయన సన్నిహితుడు యువి వంశీ అన్నా జగన్ కి ఇష్టమంటూ సవరణ ఒకటి. అబ్బో.. జగన్ ని వేలెత్తి చూపిస్తే సినిమా ఇండస్ట్రీ పనైపోయినట్లే అనే భావన అందరిలో కలిగించేస్తుంది వైసిపీ ప్రభుత్వం, ఆయన బూతు మంత్రులు, అనుకూల మీడియా.

Threats to Ashwini Dutt started:

Ashwini Dutt fires on YCP government
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs