అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య కష్టడితో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఏజెంట్ ప్లాప్ తో నాగ చైతన్య కష్టడితో హిట్ కొట్టాలంటూ అభిమానుల ప్రెజర్ ఎక్కువైంది. ప్రస్తుతం చైతు కష్టడి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. కష్టడి ప్రమోషన్స్ లో తన కెరీర్ లో డిసాస్టర్ అయిన మూవీస్ గురించి, లైఫ్ లో ఏదైనా బాధాకరమైన సంఘటన ఉందేమో అనే మాటకు నాగ చైతన్య డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఆయన లైఫ్ లో అతి పెద్ద టర్నింగ్ పౌయింట్ సమంతని వివాహం చేసుకొవడం, ఆమెతో విడిపోవడమే.
కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పటివరకు నా లైఫ్ లో బాధాకరమైన సంఘటనలు లేవు, నాకు ఎదురైన ప్రతి సంఘటన నాకు ఏదో ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సినిమాల కథల ఎంపిక విషయంలో బాధపడ్డాను, కథల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. దాదాపుగా మూడు చిత్రాల విషయంలో అలానే జరిగింది. దాని గురించి ఇప్పటికి బాధపడుతుంటాను.. అంటూ నాగ చైతన్య తన లైఫ్ లో జరిగిన సంఘటనల వలన తానేమి బాధపడలేదు అంటూ సమంత విడాకుల విషయంలో కూడా చాలా లైట్ గానే ఉన్నట్లుగా అనిపించాడు.
కృతి శెట్టి తో రెండోసారి జోడీ కడుతున్న నాగ చైతన్య కష్టడి చిత్రాన్ని తెలుగు, తమిళంలో బైలింగువల్ మూవీగా చేసాడు. ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నాడు.