Advertisement
Google Ads BL

పవన్ ని తిట్టి చిరూని కలిపేసుకుంటున్న పోసాని


పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఓ నటుడే కాదు ఏపీ ప్రభుత్వంలో పదవిలో కొనసాగుతున్న వ్యక్తి కూడా. సీఎం జగన్ కి భజన చేస్తూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ జగన్ దగ్గర మార్కులు కొట్టేసి పదవులు పట్టేసి.. ఇండస్ట్రీలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై కౌంటర్లు వేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. తాజాగా అశ్విని దత్ వైసిపి ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ చూసిన పోసాని అదేదో తననే అనేసినట్లుగా ఫైర్ అవడమే కాదు.. మెగాస్టార్ చిరుని తనకి మద్దతుగా జగన్ కి అన్నగా కలిపేసుకోవడం ఆశ్చర్యం వేస్తుంది.

Advertisement
CJ Advs

ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్ ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి

ఉత్తమ వెదవలు, ఉత్తమ సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి

రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగుడు కొమ్మను మాకు అభ్యంతరం లేదు

అతను చెన్నై లో సూపర్ స్టార్ తెలుగు వాళ్లకుకాదు. మాకు సూపర్ స్టార్ వున్నారు ఆయనే చిరంజీవి.

చిరంజీవి గారికి జగన్ గారు అంటే ఎంతో ప్రేమ, అలాగే చిరంజీవి అంటే అన్న అన్న అంటు వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు జగన్ గారు అంటూ మెగాస్టార్ చిరు జగన్ కి మద్దతు ఇస్తారంటూ పోసాని చిరుని తమలో కలిపేసుకోవడం పై నెటిజెన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఏ పోసాని నీవొక్కడివే అయ్యావనే భయంతో ఇండస్ట్రీ పెద్ద చిరుని కలుపుకుంటున్నావా. ఆయన తమ్ముడు పవన్ ని తిట్టి ఇప్పుడు చిరు మావాడే అంటే ఒప్పుకుంటారా? తమ్ముడిని తిట్టిన వాళ్లతో చిరు ఎలా కలుస్తారు. ఆ మాత్రం సెన్స్ లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Posani scolds Pawan and joins Chiru:

Posani fires on Ashwini Dutt
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs