Advertisement
Google Ads BL

ఏజెంట్ వైఫల్యంపై నిర్మాత కామెంట్స్


అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ గత శుక్రవారం రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి రిజెక్ట్ అయ్యింది. అఖిల్ ఏజెంట్ గా అద్భుతమన్న ఆడియన్స్ దర్శకుడిపై దుమ్మెత్తిపోశారు. అటు అఖిల్ తప్పులేదు, ఇటు బడ్జెట్ పెట్టిన అనిల్ సుంకర తప్పు లేదు అంటూ ఆడియన్స్ ముక్తఖంఠంగా చెబుతున్నారు. మొదటి రోజే అఖిల్ ఏజెంట్ కలెక్షన్స్ చూసి మేకర్స్ కళ్లుతేలేసారు. అయితే తాజాగా ఏజెంట్ ప్లాప్ పై నిర్మాత అనిల్ సుంకర బోల్డ్ గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు ఏజెంట్ చిత్రం ప్లాప్ పై టీం నుండి ఎలాంటి స్పందన లేదు. అందరూ కామైపోయారు. కానీ నిర్మాత అనిల్ సుంకర తాజాగా సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ ప్లాప్ పై కామెంట్స్ చేసారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఏజెంట్ సెట్స్ మీదకి వెళ్లడమే ఆ సినిమా పోవడానికి ప్రధానకారణమన్నారు. మేము ఏజెంట్‌ మూవీ ఫెయిల్యూర్ కావడంతో పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటున్నాము. ఇది ఒక భారీ సినిమా అని మాకు తెలిసినప్పటికీ, మేము సక్సెస్ కొట్టాలి అనుకున్నాము. 

కానీ మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంలో పొరపాటు జరిగింది. కోవిడ్‌తో సహా అనేక కారణాల వలన అనుకున్నట్లు ప్రాజెక్ట్ ను ఫినిష్ చేయడంలో విఫలమయ్యాము. మేము ఈ ఫెయిల్యూర్ విషయంలో ఎటువంటి సాకులు చెప్పకూడదనుకుంటున్నాము. ఈ ఖరీదైన తప్పు నుండి నేర్చుకోవాలి. మేము ఇలాంటి తప్పులను ఎప్పటికీ పునరావృతం చేయము. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. 

ఇకపై మేము మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో అంకితమైన ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము.. అంటూ అనిల్ సుంకర ఏజెంట్ ఫెయిల్యూర్ విషయంలో ఎవరిని పర్టిక్యులర్ గా బ్లేమ్ చేసారో అర్ధం కూండా నర్మగర్భంగా స్పందించారు.

Anil Sunkara bold statement on Agent:

Anil Sunkara accepts Agent failure
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs