ఏపీ లో జగన్ సీఎం అయినప్పటినుండి టాలీవుడ్ ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. అందుకే సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించి ప్రజలకి మంచి చేస్తున్నామంటూ చెప్పి సినిమా నిర్మాతలని ఇబ్బంది పెట్టడం, అసలు నంది అవార్డుని ఇవ్వడమే మానెయ్యడం, ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ కి పదవులు ఇచ్చి సినిమా వాళ్ళని తిట్టించడం ఇలాంటివన్నీ జగన్ ప్రభుత్వం చేస్తుంది. కానీ జగన్ చేసే పనికి ఏ ఒక్క సినీ ప్రముఖుడు నోరెత్తే ఛాన్స్ ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే తర్వాత వాళ్ళు చేసే సినిమాలకి ఎలాంటి కష్టాలు వస్తాయో అని వారి భయం. ఇప్పుడు తమినాడు నుండి రజినీకాంత్ ఏపీకి వచ్చి చంద్రబాబు, బాలకృష్ణలని పొగడగానే వైసీపీ మంత్రులు, ఎమ్యెల్యేలు గోల గోల చేస్తున్నారు.
ఇక ఇప్పుడు అశ్విని దత్, అది శేషగిరి రావు లాంటి వాళ్ళు ఈరోజు ఒ ప్రెస్ మీట్ లో జగన్ ప్రభుత్వం పై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు.. ఒకప్పుడు నంది అవార్డులు అంటే ఎంతో ప్రాధాన్యత ఉండేవని, అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పూర్తిగా పక్కన పెట్టేసాయని అన్నారు. నంది అవార్డులు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు.
ఇక అశ్విని దత్ అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే అవార్డులకి అసలు వాల్యూ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తున్నారని సెటేరికల్ గా వైసీపీపై కామెంట్స్ చేశారు. మరో మూడేళ్ళలో ఆవార్డులు ఘనంగా ఇచ్చే రోజులు వస్తాయని కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసారు.