Advertisement
Google Ads BL

భోళా శంకర్ నుంచి చిరు వింటేజ్ లుక్


మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కలయికలో క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతునన్ చిత్రం భోళా శంకర్. మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది. మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు.  ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్.

Advertisement
CJ Advs

చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Chiru Vintage Mass Look Posters From Bholaa Shankar:

Chiranjeevi Vintage Mass Look Posters From Meher Ramesh Bholaa Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs