Advertisement
Google Ads BL

చైతన్య మరణం: శ్రద్ద, శేఖర్ మాస్టర్ ఎమోషనల్


అప్పులు తీర్చలేక నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు.. ఢీ లో ఫెమస్ కొరియోగ్రాఫర్ చైతన్య. నిన్న ఆదివారం ఢీ డాన్స్ షో ఫ్యామిలీ చైతన్యని కోల్పోయి కన్నీరు మున్నీరవుతుంది. ఎంతో టాలెంట్ ఉండి.. తమ మధ్యలో ఉండే డాన్స్ మాస్టర్ ఇలా ఉన్నట్లుండి తనువు చాలించడం అందరిని దుఃఖ సాగరంలోకి నెట్టేసింది. ఢీ డ్యాన్స్ షో ద్వారా నేమ్, ఫేమ్ వస్తాయ్.. కానీ డబ్బులు రావు.. ఈటీవీలో జబర్దస్త్‌షోలలో వచ్చినట్లు సంపాదన రాదు.. కానీ చాలా కష్టపడి ఈ షోలో నిలదొక్కుకున్నాం.. అయినా ఈ నేమ్, ఫేమ్ కాపాడుకోలేకపోతున్నాను అంటూ చైతన్య సూయిసైడ్ కి ముందు చేసిన వీడియో కన్నీరు ఎపట్టిస్తుంది.

Advertisement
CJ Advs

నిన్నటివరకు తమ పక్కనే ఉన్న చైతన్య ఇలా నిర్జీవంగా పడి ఉండడాన్ని ఢీ డాన్స్ షోలో భాగమైన ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేక కంట తడిపెడుతున్నారు. చైతన్య మాస్టర్ సూసైడ్‌పై శేఖర్ మాస్టర్, శ్రద్ధా దాస్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ ఇలా ప్రతి ఒక్కరూ చైతన్య మరణంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ వార్త విన్నప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎప్పటికీ మరిచిపోలేను.. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం చైతన్య అంటూ శేఖర్ మాస్టర్ స్పందించారు.

ఢీ స్టేజ్ పై చైతన్యతో సరదాగా కాలు కదిపిన శ్రద్ద దాస్ ఎమోషనల్ అవుతూ చావు పుట్టుకలు అనేవి మనిషి ఆలోచన కంటే అతీతమైనవి. నిజంగా చైతన్య మాస్టర్ బతికినంత కాలం చాలా గొప్పగా, మంచి మనసుతో బతికారు. మీ కోసం నేను చేయగలిగింది ఒక్కటే.. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ నవ్వు నలుగురిని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుంది. ఈరోజు చాలా బాధపడ్డాను.. మీ నవ్వును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటూ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసింది.

Chaitanya death: Shraddha, Shekhar master emotional:

Dhee choreographer Chaitanya commits suicide
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs