పవన్ కళ్యాణ్ ఎక్కడ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసిపోతాడో అని వైసీపీ బ్యాచ్ తెగ కంగారు పడిపోతుంది. రెండు రోజుల క్రితం నారా చంద్రాబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటవడం వైసీపీ శ్రేణుల్లో కంగారు పుట్టించింది. వీరిద్దరూ కలిసి కట్టుగా గెలిచేసి అధికారాన్ని తమ వద్దనుండి లాక్కుపోతారో అని కంగారు పడుతున్నారు. అందుకే పవన్ తో బాబు కలవకుండా ఉండేందుకు నానా మాటలు అంటూ వారిని రెచ్చగొడుతున్నారు.
పవన్ స్క్రిప్ట్ చంద్రబాబు చదువుతున్నాడు, చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ చదువుతున్నాడు అంటూ వారి ప్రశంగాలని వేలెత్తి చూపించే వైసిపి నేతలు ఇప్పుడు బాబు-పవన్ మీటింగ్ విషయంలో దిక్కుతోచని స్థితిలోకి వెళుతున్నారు. దానితో పవన్ కళ్యాణ్ నువ్వు ఏదో అనుకుని చంద్రబాబుని కలిసావ్.. బాబుతో పొత్తు పాముతో స్నేహం లాంటిది. చంద్రబాబు పాములాంటివాడు.. ఎంతగా స్నేహంగా ఉన్నా తర్వాత మోసం చేస్తాడు నువ్వు జాగ్రత్తగా అంటూ పవన్ ని వైసీపీ అనుకూల మీడియా సలహా ఇస్తూ పవన్ ని హెచ్చరించడం చూస్తే వైసీపీకి ఎంతగా టెన్షన్ ఉందొ అర్ధమైపోతుంది.
చంద్రబాబు వ్యూహ రచన, పవన్ కళ్యాణ్ తెలివి తేటలు తోడై ఆంధ్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాయని వైసీపీ శ్రేణుల్లో ముఖ్యంగా జగన్ లో ఇన్సెక్యూర్ ఏర్పడి మంత్రులని రెచ్చగొట్టి వాళ్లపై రకరకాల కామెంట్స్ చేయిస్తున్నారని అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఎప్పుడో మొదలయ్యింది.