Advertisement
Google Ads BL

బాలయ్య వారసుడి స్క్రిప్ట్ రెడీ అవుతుంది


బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఎప్పటికప్పుడు అభిమానులు అంచనాలు పెట్టుకోవడము బాలయ్య నిరాశపరచరడం చూస్తున్నారు. ఇదిగో మోక్షజ్ఞ రాబోతున్నాడు.. అదిగో అనడమే కానీ.. ఆయన సినిమాల్లోకి వచ్చింది కనిపించడమే లేదు. ఈమధ్యన మోక్షజ్ఞ పబ్లిక్ లో ఎక్కువ కనిపిస్తున్నాడు. తండ్రి సినిమాలని అభిమానులతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఏడాది జూన్ పది బాలయ్య బర్త్ డేకి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికర అప్ డేట్ రాబోతుంది అని తెలుస్తుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సందర్భంగా బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 స్క్రిప్ట్ ని మోక్షుజ్ఞ కోసం రెడీ చేస్తున్నట్టుగా హింట్ ఇవ్వడంతో ఈ ఏడాది మోక్షుజ్ఞ ఎంట్రీ పక్కా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోపక్క మోక్షజ్ఞ బాలయ్య-బోయపాటి చిత్రంలో గెస్ట్ రోల్ ద్వారా ప్రేక్షకులకి పరిచయమయ్యే ఆలోచనలో ఉన్నాడంటున్నారు.

అఖండ తర్వాత బోయపాటి రామ్ తో, బాలకృష్ణ అనిల్ రావిపూడితో సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అవ్వగానే.. బాలయ్య-బోయపాటి కాంబో మూవీ ఉంటుంది అని దానిలో మోక్షజ్ఞ గెస్ట్ గా తెరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ఈ ఏడాది ఏది జరిగినా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఖచ్చితంగా ఉండితీరుతుంది అనే సంకేతాలు అందుతున్నాయి.

Balakrishna looking for scripts for his Son:

Script Ready for Nandamuri Mokshagna Debut
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs