సమంత నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాకవుతారు. టాప్ హీరోయిన్‌గా, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లతోనూ సమంత అధికంగా సంపాదిస్తుంది. నాగ చైతన్యతో పెళ్లి, విడాకులు ఆమె క్రేజ్‌ని సోషల్ మీడియాలో మరింతగా పెంచేశాయి. అలాగే గత ఏడాది ఆమె అనారోగ్యం కూడా నెటిజెన్స్‌లో విపరీతమైన సింపతీని క్రియేట్ చేయడం ఆమెకి మరింత ప్లస్ అయ్యింది. ఒక్కో సినిమాకి దాదాపుగా ఆమె ఐదు కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే రియల్ ఎస్టేట్‌లో భాగంగా హైదరాబాద్, ముంబైలో ఖరీదైన ఇల్లు కొన్న సమంత.. అటు పలు బ్రాండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేతినిండా సంపాదిస్తుంది. రీసెంట్‌గానే పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సమంత.. సోషల్ మీడియాలో బ్రాండ్ విలువ చూస్తే మతిపోతుంది. ఆమె వేసే ఒక్కో పోస్ట్ విలువ 20 లక్షలకి పైమాటే అని తెలుస్తుంది. కారణం సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రమ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి.
అటు వస్త్ర వ్యాపారంలోకి దిగిన సమంత ఓ స్కూల్ కూడా పెట్టింది. ఇంతగా సంపాదిస్తున్న సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా అనేకమంది చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్స్ చేయిస్తూ తన ఉదారతని చాటుకుంటుంది. ప్రస్తుతం శాకుంతలం డిజాస్టర్ మూడ్ నుండి సిటాడెల్ షూటింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది సమంత. దానితో పాటుగా విజయ్ ఖుషి షూటింగ్‌లోనూ పాల్గొంటుంది.