నాగార్జున ఏడాదికి ఓ సినిమా దానితో పాటుగా మూడు నెలల పాటు బిగ్ బాస్ హోస్ట్‌గా చేస్తూ తెగ సంపాదించేస్తున్నాడు. అయితే ఘోస్ట్ ప్లాప్ తర్వాత నాగార్జున బిగ్ బాస్ ముగించేసి సైలెంట్ అయ్యారు. అందులోనూ బిగ్ బాస్ ఓటిటి కూడా ఈ ఏడాది లేకపోవడంతో నాగార్జున గత ఆరు నెలలుగా కామ్‌గా కనబడుతున్నారు. కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కానీ నాగార్జున ఆ విషయంలో మౌనాన్ని వీడడం లేదు. ఇటు చూస్తే కొడుకులిద్దరూ వరసగా ప్లాప్‌లు చవి చూస్తున్నారు. రీసెంట్ గా అఖిల్ ఏజెంట్‌తో కొట్టిన డిజాస్టర్ చూసిన నెటిజెన్స్.. అయ్యా నాగార్జున గారు మనకి బిగ్ బాస్ అవి ఎందుకండీ.. ముందు కొడుకుల కెరీర్ లు సెట్ చెయ్యండి. నాగ చైతన్య-అఖిల్ కి ఓ హిట్ పడే కాంబినేషన్స్‌ని సెట్ చెయ్యండి. మీరు ముందు కొడుకుల భవిష్యత్తుని చూసుకోండి. వాళ్ళు హీరోలుగా సెటిల్ అయితేనే మీకు గౌరవం.. ఇలా వరసగా డిజాస్టర్స్ పడితే వారి కెరీర్ కే ప్రమాదం అంటూ సలహాలు పడేస్తున్నారు.
మరి గతంలో డిజాస్టర్ పడిన హీరోలకి పెద్దగా పోయేదేం ఉండేది కాదు. కానీ ఈ కాలంలో అంటే సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందాక సినిమా డిజాస్టర్ అనగానే దర్శకులని, హీరోలని ట్రోల్ చేస్తూ నెటిజెన్స్ ఆడేసుకుంటున్నారు. అందుకు అతి పెద్ద ఉదాహరణ బాలీవుడ్ అనేది తరచూ చూస్తున్నాం కూడా.