Advertisement
Google Ads BL

బాలీవుడ్ హీరోలా.. శ్రీకాంత్ అయ్యంగార్


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన, పొందుతోన్న నటులలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఆయనకు వేషం ఇస్తే.. ఆ వేషానికి, పాత్రకి పర్ఫెక్ట్ న్యాయం చేయగల నటుడాయన. అందుకే.. ఇప్పుడు ఇండస్ట్రీలో దర్శకులు శ్రీకాంత్ అయ్యంగార్ కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టిస్తున్నారు. అయితే ఈ నటుడు తాజాగా తన ట్విట్టర్‌లో ఓ ఫొటోని షేర్ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 

Advertisement
CJ Advs

ఏంటా ఫొటో అని అనుకుంటున్నారా? శ్రీకాంత్ అయ్యంగార్ 30 సంవత్సరాల క్రితం మంచి వయసులో ఉన్న ఫొటో అది. ఈ ఫొటోలో ఆయన ఓ బాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. తన బేర్ బాడీని చూపిస్తూ ఓ క్రికెటర్‌ని కూడా తలపిస్తుండటం విశేషం. అలాగే ఈ ఫొటోలో అప్పటి రేర్ వస్తువులను కొన్నింటిని గుర్తించవచ్చు. ఈ ఫొటోని షేర్ చేసిన శ్రీకాంత్ అయ్యంగార్.. 30 సంవత్సరాల క్రితం ఫొటో. ఈ ఫొటోలో ఉన్నది నేనే అంటే ఎవరూ నమ్మలేరు అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ ఫొటోకి నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే.. అప్పుడు ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా మీరు బాలీవుడ్ హీరో అయ్యేవారు. బ్యాక్‌గ్రౌండ్ లేక ఆగిపోయారేమో.. లేదంటే మీరు హీరోగా చక్రం తిప్పుతుండేవారు. ఈ ఫొటో చూస్తుంటే షారుఖ్, అక్షయ్, సల్మాన్ ఖాన్ గుర్తొస్తున్నారు. హీరోగా ట్రై చేయలేదా కాకా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ కామెంట్స్‌తో ఈ ఫొటో ట్రెండ్ అవుతోంది.  

Shrikanth Iyyangar 30 Years Ago Photo goes Viral:

Shrikanth Iyyangar Shares His Rare Photo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs