Advertisement
Google Ads BL

‘ఏజెంట్’కి మరో మైనస్ ఏమిటంటే..


ఏజెంట్‌కి మెయిన్ మైనస్ దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకి దర్శకుడైన సురేందర్ రెడ్డి.. నిర్మాత అనిల్ సుంకరతో భారీ బడ్జెట్ పెట్టించాడు కానీ.. మేకింగ్ విషయంలో చాలా లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డితో పాటుగా ఏజెంట్‌కి మరో మైనస్‌గా హీరోయిన్ సాక్షిని చూపిస్తున్నారు. స్పై థ్రిల్లర్స్‌కి హీరోయిన్స్ అవసరం లేకపోయినా.. గూఢచారి, హిట్ 2, మేజర్ లాంటి సినిమాల్లో హీరోయిన్స్‌కి ఉండాల్సిన స్కోప్ ఉంది. అది కథని పక్కకి కూడా పోనివ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ ఏజెంట్‌లో సాక్షి వైద్య అందాలు చూపించడమే కానీ ఆమె పాత్రకి ప్రాధాన్యత పక్కనబెట్టి అసలు ఆ కేరెక్టర్‌కి ఆమెని ఎందుకు తీసుకున్నారా? అనేలా ఉంది ఆమె పాత్ర, ఆ గ్లామర్. సాక్షి వైద్య కాకుండా ఏదైనా పేరున్న హీరోయిన్ అయినా కాస్త ఆ పాత్రకి ఇంపాక్ట్ ఉండేది. అఖిల్-సాక్షి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏజెంట్ మెయిన్ మైనస్లలో సాక్షి వైద్య కూడా చేరింది అనే అభిప్రాయాలను అక్కినేని ఫాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్‌కు ఈ సినిమా మరోసారి తీవ్ర నిరాశనే మిగిల్చింది. అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అఖిల్‌కు హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరా? అని మళ్లీ సెర్చింగ్ మొదలెట్టారు. అఖిల్ తదుపరి సినిమా ఏమిటనేది ఇంత వరక సరైన క్లారిటీ అయితే రాలేదు.

This is the One More Minus to Akhil Akkineni Agent:

Heroine is the Main Drawback to the Agent Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs