Advertisement
Google Ads BL

NTR30 మేజర్ హైలైట్


కొరటాల శివ ఎన్టీఆర్‌తో చెయ్యాలనుకున్న కథని ఆచార్య డిజాస్టర్ తర్వాత పక్కనబెట్టేసి ఎన్టీఆర్ కోసం మరో కొత్త మాస్ కథని ప్రిపేర్ చేసుకున్నాడు. గత ఏడాది జూన్ నుండి కొరటాల శివ #NTR30 పైనే కూర్చున్నాడు. ఆచార్య డిజాస్టర్‌తో బాగా ఇబ్బంది పడిన కొరటాల.. ఎన్టీఆర్‌తో గట్టిగా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే షూటింగ్ మొదలు పెట్టాక సెట్స్‌లో ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా, హడావిడి పడకుండా ముందే పక్కా ప్లానింగ్‌తో ఎన్టీఆర్‌తో కలిసి సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

ఆచార్యతో డ్యామేజ్ అయిన తన పేరుని NTR30తో నిలబెట్టుకోవాలని కొరటాల గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం #NTR30 షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తుంది. అటు ఎన్టీఆర్-ఇటు కొరటాల ఎలాంటి గ్యాప్స్ రాకుండా షూటింగ్‌ని చక చకా అనుకున్న సమయానికి ముగించేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారట. తొలి షెడ్యూల్లోనే సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన ఎపిసోడ్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌లోనే ఓ భారీ యాక్షన్ ఘట్టం కూడా ఉందట. అది కుస్తీ పోటీ నేపథ్యంలో సాగుతుందని, భారీ ఎత్తున జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఈ ఫైట్ చిత్రీకరించారని.. ఈ ఎపిసోడ్ #NTR30 కి హైలెట్ అంటున్నారు.

అంతేకాకుండా #NTR30 నుండి యంగ్ టైగర్ బర్త్ డే‌కి ఫాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నారట. మే 20‌నే ఎన్టీఆర్ బర్త్ డే. అంటే జస్ట్ 20 డేస్ మాత్రమే సమయం ఉండడంతో కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న షూటింగ్ నుండి NTR30 గ్లిమ్ప్స్ కానీ లేదంటే టైటిల్ కానీ వదిలే ప్లాన్ చేసుకుంటున్నాడట. సో #NTR30 మొత్తం పక్కా ప్లానింగ్‌తో జరుగుతుంది.

This is the NTR30 Major Highlight:

Koratala Plans Heavy Action Episode in NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs