Advertisement
Google Ads BL

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రివ్యూ


టాలెంటెడ్ యాక్టర్స్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనుష్క శెట్టి, తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపై మంచి అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ ను శ్రీ నిధి కాలేజ్ లో ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య విడుదల చేసింది మూవీ టీమ్. 

Advertisement
CJ Advs

ఈ మూవీ ఒక చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ మధ్య సాగే కథగా ఆల్రెడీ చెప్పారు. టీజర్ లో దాన్ని మరింత ఎంటర్టైనింగ్ గా చూపించారు. రవళి పాత్రలో నటించిన అనుష్క ప్రొఫెషనల్ చెఫ్. పెళ్లంటే ఇష్టం ఉండదు. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇటు పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా స్టాండప్ కమెడియన్ గా రాణించాలని ప్రయత్నించే మరో కుర్రాడు. ఈ ఇద్దరికీ అనుకోకుండా పరిచయమై ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. మరి ఆ స్నేహం ఏ తీరాలకు చేరింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఉందీ టీజర్. అయితే ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క.. నవీన్ ను ఇంటర్వ్యూ చేస్తూ.. నీ స్ట్రెంత్ ఏంటీ అని అడుగుతుంది.. అందుకు నవీన్ అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా అని చెబుతాడు.. వీక్ నెస్ గురించి అడిగితే.. సిట్యుయేషన్ కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా అని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. చివర్లో నీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా అని అడిగితే కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడమ్ అని చెబుతాడు. 

అంటే ఈ సినిమా నుంచి కూడా బోలెడు కామెడీ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు ఇన్ డైరెక్ట్ గా చెప్పారనుకోవచ్చు. ఓవరాల్ గా టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఖచ్చితంగా ఓ మంచి ఎంటర్టైనింగ్ మూవీని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనేలా టీజర్ తోనే చెప్పారు. 

Miss Shetty Mr Polishetty teaser review:

Teaser for Miss Shetty Mr Polishetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs