Advertisement
Google Ads BL

అక్కినేని హీరోల పరువు కాపాడతాడా?


అక్కినేని హీరోలకి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. అటు నాగ చైతన్య పర్సనల్ లైఫ్ లో విడాకుల విషయంలో బాగా సఫర్ అయ్యాడు. ఆ తర్వాత చైతూ కెరీర్ లో సక్సెస్ లేదు. విక్రమ్ కుమార్ తో చేసిన థాంక్యూ భారీ డిసాస్టర్ అవడంతో అక్కినేని ఫ్యామిలీ షాకయ్యింది. ఆతర్వాత నాగార్జునకి ఘోస్ట్ జర్క్ ఇచ్చింది. ప్రవీణ్ సత్తారు తో చేసిన ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ అక్కినేని కి ఏజెంట్ మూవీ షాకిచ్చింది. 

Advertisement
CJ Advs

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్ అవ్వుద్ది అనుకున్నారు. అఖిల్ కి మాస్ హిట్ పక్కా అని నమ్మారు. కానీ అఖిల్ కి ఏజెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ చిత్రంతో అఖిల్ బాగా డౌన్ అయ్యాడు. ఇప్పటికే కెరీర్ లో సూపర్ హిట్ లేక సతమతమవుతున్న అఖిల్ కి ఏజెంట్ ఇచ్చిన షాక్ అలాంటి ఇలాంటి షాక్ కాదు. అటు చూస్తే సుశాంత్ కి రావణాసుర భారీ డిసాస్టర్ ఇచ్చింది. అక్కినేని ఫాన్స్ ఈ డిజాస్టర్స్ తో రగిలిపోతున్నారు.

నాగ చైతన్య కష్టడితో హిట్ కొట్టి ఫాన్స్ ని కూల్ చేస్తాడా.. అక్కినేని హీరోల పరువు కాపాడుతాడా.. మే 12 న రాబోతున్న కష్టడి హిట్ అవ్వాలని అక్కినేని ఫాన్స్ బలంగా కోరుకుంటున్నారు. నాగ చైతన్య వెంకట్ ప్రభు కాంబోలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కష్టడి చిత్రానికి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. చూద్దాం చైతూ అయినా అక్కినేని పరువుని కాపాడుతాడా.. లేదా.. అనేది.

Does Naga Chaitanya Custody make Akkineni fans cool?:

Custody release on May 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs