Advertisement
Google Ads BL

అరవోళ్ళ అతి చూసారా?


కోలీవుడ్ లో విజువల్ వండర్ గా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 గత ఏడాది విడుదల కాగా.. ఆరు నెలలు తిరక్కుండానే పార్ట్ 2 ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. పార్ట్ 1 తమిళంలో భారీ హిట్ అయినా.. పాన్ ఇండియాలోని భాషల్లో అంతగా పెరఫామ్ చెయ్యలేకపోయింది. ఇప్పుడు PS 2 ని భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తేగా.. తమిళంలో పొన్నియన్ సెల్వన్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చెయ్యడమే కాదు.. ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. తమిళనాట తమిళులకు అది నచ్చేసింది. కానీ ఇతర భాషల్లో పొన్నియన్ సెల్వానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.

Advertisement
CJ Advs

ఇటు పాన్ ఇండియాలో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బెటర్ గా ఉంది అంటుంటే.. పొన్నియన్ సెల్వన్ పర్వాలేదు అంటున్నారు తెలుగువాళ్లు. అయితే అరవోళ్లు అదేనండి తమిళ్ ప్రేక్షకులు మళ్ళీ ఇక్కడ రాజమౌళి బాహుబలిని, మణిరత్నం పొన్నియన్ సెల్వాన్ని పక్కనబెట్టి మరీ పొన్నియన్ సెల్వన్ గ్రేట్, మణిరత్నం సూపర్ అంటూ మణిరత్నం  పొన్నియన్ సెల్వన్ తర్వాతే బాహుబలి అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. అంతేకాకుండా మణిరత్నం కన్నా రాజమౌళి ఎందులోనూ ఎక్కువ కాదంటూ పోస్టర్స్ వేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇటు చూస్తే తెలుగోళ్లు బాహుబలితో పోలికేంటి.. బాహుబలి సినిమాలో బాహబలి, భళ్లాల దేవా, దేవసేన, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ ఇలా ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉండడమే కాదు, ప్రతి పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది.

కానీ పొన్నియన్ సెల్వంలో ఒక్క తార పేరు పలకడానికి కష్టంగా ఉండడమే కాదు.. అసలు ఏ పాత్రకి ఎక్కువ ప్రధాన్యత ఉందో తెలుసుకునే సమయానికే సినిమా సగం అయ్యిపోయింది అంటున్నారు. మా బాహుబలికి మీ పొన్నియన్ సెల్వానికి పోలికా అంటూ తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ ఫాన్స్ అరవోళ్లని ఆడేసుకుంటున్నాడు. మొదటి పార్ట్ సో సో గా ఉంటేనే ఎక్కడా ఆగని తమిళులు ఇప్పుడు PS2 కి కాస్త పాజిటివ్ టాక్ రాగానే మా బాహుబలితో పోల్చేసుకుని విర్రవీగుతున్నారా.. అరవోళ్ళ అతి అలానే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఇక బాహుబలి 2 కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేసారో.. అందరికి తెలుసు. కానీ పొన్నియన్ సెల్వన్ 2 వస్తుంది అంటే పక్క భాషల వారు ఎవరూ ఇంట్రెస్టింగ్ గా లేరు. కేవలం తమిళులు తప్ప అనే డైలాగ్స్ వేస్తూ తమిళోళ్ళని తెలుగోళ్లు ఆడేసుకుంటున్నాడు.

Ponniyin Selvan 2 vs Baahubali:

Tamil audience vs Telugu audience
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs