Advertisement
Google Ads BL

ఏజెంట్ లోపాలున్నాయి: అమల ఓపెన్ లెటర్


అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ డిసాస్టర్ అవడం అటుంచి అఖిల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. అక్కినేని ఫాన్స్ అఖిల్ విషయంలో డిస్పాయింట్ అవుతుంటే.. పబ్లిక్ మాత్రం ఏజెంట్ ని చూసి అఖిల్ నువ్వెప్పుడూ హిట్ కొడతావ్.. నీ హిట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని కొందరు నీకు సినిమాలెందుకు అఖిల్ పోయి క్రికెట్ ఆడుకో అంటూ కొందరు అఖిల్ ని ట్రోల్ చేస్తున్నారు. దానితో కొడుకు అఖిల్ పై వస్తున్న ట్రోల్స్ కి అమల స్పందించడమే కాదు.. అభిమానులకి అమల ఓపెన్ లెటర్ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఎందుకలా ట్రోల్ చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను. నేను కూడా ఏజెంట్ చూశాను. సినిమా చివరి వరకు ఎంజాయ్ చేశాను. సినిమాలో లోపాలున్నాయి. మీరు గనక ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్ లో నేను ఏజెంట్ చూస్తున్న టైంలో సగంమంది లేడీస్ ఉన్నారు. యాక్షన్ సీన్స్ స్క్రీన్ మీద కనిపించగానే అరుస్తూ, కేకలేస్తూ బాగానే ఎంజాయ్ చేశారు. 

నేను ఒకటే చెప్పగలను. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది.. అంటూ అమల అభిమానులకి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. నాలుగైదు సినిమాలు చేసినా అఖిల్ ఇప్పటివరకు సూపర్ హిట్ కొట్టకపోవడం అక్కినేని అభిమానులకి నిద్ర కరువయ్యేలా చేసింది అనేది వాస్తవం.

 

 

Agent reacts to Agent poor box office:

Akhil Akkineni mother reacts to Agent poor box office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs