Advertisement
Google Ads BL

బాలయ్య పై సూపర్ స్టార్ ఫన్నీ కామెంట్స్


నందమూరి బాలకృష్ణ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫన్నీ కామెంట్స్ చేసారు. నిన్న శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరైన రజినీకాంత్ అక్కడ స్టేజ్ పై ఎన్టీఆర్, బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడి తెలుగు తమ్ముళ్ళని మైమరపించారు. రజినీ బాలయ్య పై చేసిన కామెంట్స్ నవ్వు తెప్పించాయి. రజినీకాంత్ అన్న ఎన్టీఆర్ గారు గురించి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారు.

Advertisement
CJ Advs

కంటి చూపుతో చంపేస్తా.. అంటూ ఒక తన్ను తంతే జీపు 30 అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది.. సినిమాల్లో ఇలాంటి పనులు రజినీకాంత్ కానీ, అమితాబ్ కానీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ఈ సీన్లు, డైలాగ్‌ లు మేం ఎవరం చేసినా జనం ఒప్పుకోరు. కానీ బాలయ్య చేస్తే మాత్రం ప్రేక్షకులు ఒప్పుకుంటారు.. విజిల్స్ వేస్తూ అభిమానంతో ఊగిపోతారు. ఎందుకంటే తెలుగు ప్రజలు బాలయ్యను బాలయ్యలా చూడలేదు. 

మహానుభావుడు ఎన్టీఆర్‌ను బాలయ్యలో చూసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఆ ఎన్టీఆర్ యుగపురుషుడు ఏమైనా చేయగలరు కదా. అలానే బాలయ్య కూడా అన్నీ చేస్తాడు. కాకపోతే చాలా కోపిష్టి.. అయినా పాల లాంటి మనసు అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ బాలకృష్ణపై చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Superstar Funny Comments on Balayya:

Rajinikanth Funny Comments On Nandamuri BalaKrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs