Advertisement
Google Ads BL

మహేష్ వెకేషన్స్ పై నెటిజెన్స్ సెటైర్స్


మహేష్ బాబు ఎవ్వరేమనుకున్నా.. నిర్మాతలు ఎలా ఉన్నా ఆయన మాత్రం తన ఫ్యామిలీతో ఏడాదికి మూడునాలుగు వెకేషన్స్ ప్లాన్ చేసుకుని ఏడాదిలో దాదాపు రెండుమూడు నెలలు పాటు ఆ వెకేషన్స్ కే కేటాయిస్తారు. తన వర్క్ ఎంత ఇంపార్టెంటో.. ఫ్యామిలీకి టైమ్ కేటాయించడమూ అంతే ఇంపార్టెంట్ అనుకునే ఫ్యామిలీ మ్యాన్ మహేష్ బాబు. అందుకే ఎంతగా షూటింగ్స్ తో బిజీగా వున్నా మహేష్ మాత్రం జాలిగా ట్రిప్స్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మహేష్ వెకేషన్స్ పై నెటిజెన్స్ మరోలా స్పందిస్తున్నారు.

Advertisement
CJ Advs

మహేష్ బాబు నిన్నగాక మొన్న పారిస్ ట్రిప్ కి వెళ్లి ఫ్యామిలీతో దాదాపు 15 రోజులు గడిపావు. వచ్చిన వారానికే మరొక ట్రిప్ అంటూ భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో ఫ్లైట్ ఎక్కడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసారు. మరోపక్క SSMB28 షూటింగ్ పై అనుమానాలు వచ్చేలా కొంతమంది పనిగట్టుకుని వేస్తున్న ట్వీట్స్ కి నిర్మాత నాగ వంశీ ఆపసోపాలు పడి బదులిస్తున్నా ఆ రూమర్స్ ఆగడం లేదు.

మే 31 న మహేష్ SSMB28 నుండి గ్లిమ్ప్స్ అండ్ టైటిల్ ని ఆశిస్తున్నారు ఫాన్స్. నిర్మాత కూడా హామీ ఇచ్చేసాడు. ఇటు చూస్తే ఇప్పటివరకు చేసిన షూటింగ్ లో కొన్ని సీన్స్ పక్కనపడేశారనే న్యూస్, అటు చూస్తే SSMB28 అప్ డేట్ కి సమయం దగ్గరవడం ఇవన్నీ ఫాన్స్ లో అందోళన రేకెత్తిస్తున్నాయి. ఇదంతా చూసిన నెటిజెన్స్.. మహేష్ ఇంత టైట్ సిట్యువేషన్ లో నీకు వెకేషన్స్ లో నిద్రెలా పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Netizens satire on Mahesh vacations:

Mahesh Babu and his family clicked at Hyderabad airport
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs