బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ సూసైడ్ కు నటుడు సూరజ్ పంచోలీ కారణమని పేర్కొంటూ అప్పట్లో సూరజ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. జియా ఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీనే కారణమని, ఆమెని ఆత్మహత్య చేసుకోవడానికి అతని మోసమే కారణమంటూ జియాఖాన్ తల్లి కేసు పెట్టడమే కాకుండా.. జియా ఖాన్ సూయిసైడ్ కి ముందు రాసిన లెటర్ ని పోలీస్ లు ఆమె చనిపోయిన పది రోజుల తర్వాత స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్ కి సూరజ్ పంచోలీకి మధ్య అఫైర్ ఉండేది. చాలా కాలం పాటు వారిద్దరి మధ్య సంబంధం కొనసాగింది.
2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అసలు కాదు జియా ఖాన్ ది ఆత్మహత్య కాదు, ఆమెని చంపేసి సూసైడ్ గా చిత్రీకరించారని జియా ఖాన్ ఆరోపించింది. దానితో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర పోలీసుల నుండి సీబీఐ కి జియా ఖాన్ సూయిసైడ్ కేసు ట్రాన్ఫర్ అయ్యింది.
ఈ కేసులో సీబీఐ విచారణ జరిపి ఆ సాక్ష్యాలని కోర్టు ముందు ప్రవేశ పెట్టింది. ఇరు వాదనలు, సాక్ష్యాధారాల ఆధారంగా నేడు సీబీఐ కోర్టు జియా ఖాన్ సూయిసైడ్ కేసులో సూరజ్ పంచోలీని నిర్దోషిగా తేల్చింది. పదేళ్ల తర్వాత సూరజ్ పంచోలికి జియా ఖాన్ కేసులో ఊరట లభించగా.. కొంతమంది ఈ తీర్పుని విమర్శిస్తున్నారు. అటు కేసు నుండి బయటపడిన సూరజ్ పంచోలీ తీర్పు వెలువడగానే స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నాడు.