ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని ఈ రోజు విజయవాడలో అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధిగా హాజరవుతారని నందమూరి బాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణలు ముఖ్య అతిధులుగా హాజరుకానున్న ఈవెంట్ ఈ రోజు శుక్రవారం.. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో జరపతలపెట్టారు.
ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం పది గంటలకి చెన్నై నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ ఎయిర్ పోర్ట్ కి రాగా.. నందమూరి బాలకృష్ణ, T D జనార్దన్ సూపర్ స్టార్ కి సాదర స్వాగతం పలికారు. బాలకృష్ణ రజినీకాంత్ ని ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. బాలయ్య ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.
నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తల కోలాహలం నడుమ అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.