టాప్ డైరెక్టర్ మణిరత్నం కలం నుండి జాలువారిన పొన్నియన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది PS1 విడుదల కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 28 న పొన్నియన్ సెల్వన్ 2 ని విడుదల చేసారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. పొన్నియన్ సెల్వన్ 1 తమిళంలో తప్ప మరే ఇతర భాషలోనూ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రంలో నటించిన విక్రమ్, ఐష్, త్రిష, కార్తీ, జయం రవి, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మిలు భారీగా ప్రమోట్ చేస్తూ PS2 పై ఆసక్తిని క్రియేట్ చేసారు. మరి నేడు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 ఎలా ఉందో ఓవర్సీస్ ప్రేక్షకుల మాటల్లో..
PS 1 కంటే PS 2 చాలా బెటర్ గా ఉందని.. ముఖ్యంగా కుందవి, నందిని క్యారెక్టర్స్ అయితే వేరే లెవల్ లో ఉన్నాయంటూ, నంది పాత్రలో ఐశ్వర్య రాయ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో కథని శాసించిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఆదిత్య కరికాలన్ గా చియాన్ విక్రమ్ సీక్వెన్స్ సూపర్బ్ గా ఉన్నాయంట. నందిని, కారకాలన్ కలుసుకునే సీన్స్ చాలాబాగున్నాయంటున్నారు. చోళుల రాజ్యంలో జరిగే కుట్రలు, వాటికి ఆదిత్యుడు, కుందవి, అరుణ్మొళి వర్మన్ చెప్పే సమాధానాలతో కథ ఆకట్టుకునే విధంగా మణిరత్నం నేరేట్ చేశారు అంటున్నారు.
ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే మాట వినిపిస్తుంది. వందియదేవన్ పాత్రలో కార్తీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2లో బాగుంది అంటున్నారు. PS 2 కథని చాలా స్లో ఫేస్ లో నడిపించిన మణిరత్నం పాత్రలని స్ట్రాంగ్ ఎలివేషన్ చూపించాల్సిన చోట కూడా డ్రామాని పండించడటం, నెమ్మదిగా సాగే కథనం PS 2కి కొంత నెగిటివ్ టాక్ తీసుకొస్తుంది. స్లో నేరేషన్ అక్కడక్కడా ఉన్నా కూడా కథ మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా చెప్పారంట. పార్ట్1లో ఉన్న చాలా ప్రశ్నలకి పార్ట్2లో మణిరత్నం సమాధానం చెప్పారని నెటిజెన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. కోలీవుడ్ సర్కిల్స్ నుండి సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.
కానీ తెలుగు, ఇతర భాషల ఆడియన్స్ నుండి పొన్నియన్ సెల్వన్ 1 తరహాలోనే PS 2 కూడా ఉంటుందనే అభిప్రాయం నెటిజన్లు నుంచి వ్యక్తం అవడం గమనార్హం.