Advertisement
Google Ads BL

కూతురికి ముద్దుపేరు పెట్టిన అలియా-రణబీర్


గత ఏడాది తన చేతుల్లోకి వచ్చిన అలియా భట్-రణబీర్ కపూర్ లు తమ బిడ్డకి రాహా అని నామకరణం చేసారు. అలియా భట్ ఎక్కువగా తన కూతురితోనే గడుపుతున్నా.. రణబీర్ మాత్రం షూటింగ్స్ అంటూ అవుట్ అఫ్ స్టేషన్ కి వెళ్లడంతో కూతురుతో పెద్దగా గడపలేకపోతున్నందుకు తెగ ఫీలైపోతున్నాడట. రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఎవరైనా రాహాని చూసి నవ్వితే తాను కూడా స్మైల్ ఇస్తుంది. రాహా కి మేము ముద్దుగా చీతా అని పేరు పెట్టాము. రణబీర్ నేను కూడా రాహాని చీతా అలానే పిలుస్తాము అంటూ అలియా కూతురు ముద్దుపేరు చెప్పింది.

Advertisement
CJ Advs

మేమెంతగా పని ఒత్తిడిలో ఉన్నా, అలసటగా ఉన్నా రాహాని చూడగానే అన్నీ మాయమైపోతాయి. తనని దగ్గరకి తీసుకుని హత్తుకోవడం కన్నా మాకింకేం కావాలి. రణబీర్ చాలా సెన్సిటివ్. రాహా పుట్టాక మరింత సెన్సిటివ్ అయ్యాడు. రణబీర్ రాహాని ఆడిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. కూతురుతో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం గడిపేస్తాడు. రణబీర్ ఉంటే రాహా నా దగ్గరకి అస్సలు రాదు.

షూటింగ్స్ కోసం ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తనని కూతురు మర్చిపోతుందేమో అని రణబీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. రణబీర్ కి కూతురంటే ఎంతో ఇష్టం, ప్రేమ. అందుకే రణబీర్ లేనప్పుడు కిటికీ దగ్గరే కూర్చుని రాహాకి నాన్నని గుర్తు చేస్తూ ఉంటాను అంటూ అలియా భట్ తన భర్త తో తమ కూతురు ఎలా ఆదుకుంటుందో ఆ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చింది.

Alia-Ranbir nicknamed the daughter:

Alia Bhatt says she and Ranbir Kapoor call Raha cheetah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs