Advertisement
Google Ads BL

కొడుకుల కోసం శ్రీవారి సేవలో నాగ్-అమల


ఏజెంట్ తో అఖిల్, కష్టడితో నాగ చైతన్య హిట్ కొట్టాలని అక్కినేని నాగార్జున.. భార్య అమలతో కలిసి ఈ రోజు ఉదయమే తిరుమల తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో నాగర్జున దంపతులు ఏడు కొండలవాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రేపు శుక్రవారం అఖిల్ లేటెస్ట్ ఫిలిం ఏజెంట్ మూవీ రిలీజ్ కాబోతుంది. అఖిల్ కొంతకాలంగా మాస్ హిట్ కొట్టాలని, సూపర్ హిట్ అందుకోవాలని ఆశతో ఉన్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో హిట్ అందుకున్న అఖిల్ ఏజెంట్ తో పాన్ ఇండియా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

మరోపక్క వరస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య కష్టడితో మే 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సో తన ఇద్దరి కొడుకుల సినిమాలు వరసగా విడుదలవుతున్న కారణంగానే నాగార్జున సతీసమేతంగా వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్టుగా చెప్పారు. ఏడాది తర్వాత శ్రీవారి సేవలో అమలతో కలిసి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నాగార్జున శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు.

అంతేకాకుండా త్వరలోనే తన ఇద్దరి కొడుకులు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేసారు, కష్టమొక్కటే కాదు.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలనే స్వామివారి దర్శనానికి వచ్చాం అని అన్నారు. అమల కూడా అఖిల్ ఏజెంట్ తోనూ, నాగ చైతన్య కష్టడితో హిట్ కొట్టాలని శ్రీవారిని వేడుకున్నట్టుగా మీడియాతో చెప్పారు.

Akkineni Nagarjuna visits Tirumala Srivari temple :

Akkineni Nagarjuna visits Tirumala srivari temple along with his wife Amala Akkinen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs