Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో హాలీవుడ్ డైరెక్టర్ సినిమా


ఆర్.ఆర్.ఆర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్నారు. ఆస్కార్ కోసం అమెరికా వెళ్లి అక్కడ హాలీవుడ్ మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడడం, హాలీవుడ్ స్టార్స్ తో పరిచయాలు అన్ని ఎన్టీఆర్ కి బాగా కలిసొచ్చేలా కనబడుతున్నాయి. కొమరం భీముడో అంటూ భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనని ఇండియన్స్ మాత్రమే కాదు.. హాలీవుడ్ జనాలు ఇష్టపడ్డారు. ఇప్పటికే ఎంతోమంది హాలీవుడ్ నటులు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడంటూ ప్రశంసించారు.

Advertisement
CJ Advs

తాజాగా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ దర్శకుడు జేమ్స్ గన్ తారక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ లో తారక్ నటన అద్భుతమని, ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని ఉందంటూ ఎన్టీఆర్ రేంజ్ మరింతగా పెంచేశారు ఆయన. ఎన్టీఆర్ కి త‌గిన పాత్ర‌ను సిద్ధం చేస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవడం కాదు ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ చేస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ ఇంటర్వెల్ సీన్ లో పులులు, అడవి జంతువుల వ్యాన్ నుండి ఎన్టీఆర్ బయటికి దూకే సన్నివేశం తనకి బాగా నచ్చింది అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ని పొగిడేశారు.

ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ చాలా కూల్ గా యాక్ట్ చేసాడు అంటూ జేమ్స్ గన్ ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. నిజంగానే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్స్, అక్కడి దర్శకులు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే ఆయనెంత గొప్ప నటుడో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Guardians of the Galaxy Director Praises NTR:

Guardians of the Galaxy Director keen to work with NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs