Advertisement
Google Ads BL

ఆదిపురుష్ ట్రైలర్ నిడివి ఎంతంటే..


ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హిందీ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. రెండు రోజులు ముందు నుండే ఆదిపురుష్ ప్రీమియర్స్ హడావిడి మొదలు కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించేసారు. ఆదిపురుష్ టీజర్ తో వచ్చిన నెగిటివిటీ పోగొట్టేందుకు మేకర్స్ చాలా ప్రయత్నాలు చేసారు. అలాగే శ్రీరామనవమికి వదిలిన పోస్టర్ పై వివాదం చెలరేగడం, ఆదిపురుష్ స్టోరీపై రకరకాల నెగెటివ్ కామెంట్స్ పడుతున్నా ఓం రౌత్ అండ్ టీమ్ మాత్రం ఆదిపురుష్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. 

Advertisement
CJ Advs

ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా 3D ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్దమవుతుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆదిపురుష్ ట్రైలర్ అందరిని స్టన్ చేస్తుంది అని, ఆదిపురుష్ ట్రైలర్ నిడివి 3.22 నిమిషాలుగా మేకర్స్ లాక్ చేశారట.. ఆదిపురుష్ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా అంటూ సోషల్ మీడియాలో మళ్ళీ హడావిడి మొదలయ్యింది. టీజర్ విషయంలో జరిగిన తప్పు ట్రైలర్ విషయంలో జరక్కూడదని మేకర్స్ కూడా పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారట.

మోడ్రెన్ రామగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ లోను విడుదల చెయ్యబోతున్నారు. తెలుగులో యువి క్రియేషన్స్ వారు ఆదిపురుష్ ని విడుదల చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ ట్రైలర్ నుండి సినిమా విడుదల వరకు ప్రతి రోజు సినిమా ప్రమోషన్స్ తో మీడియాని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారట.

Adipurush trailer runtime:

Adipurush trailer runtime locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs