యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ మూవీగా మొదలైన #NTR30 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అతి పెద్ద విలన్ గా కనిపిస్తాడని, అధర్మాన్ని రౌడీయిజంతోనే చీల్చి చెండాడుతాడంటూ సోషల్ మీడియాలో #NTR30 స్టోరీపై రకరకాల న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పోటీ పడేందుకు పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని దించారు. రీసెంట్ గానే సైఫ్ #NTR30 సెట్స్ లో జాయిన్ అయ్యారు.
అయితే ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్యన పోటాపోటీ డైలాగ్స్ ఉండడమే కాకుండా తారక్, సైఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయట. సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా ఎన్టీఆర్ పాత్రకి ఏమాత్రం తీసిపోకుండా చాలా వైల్డ్ గా ఉండబోతుందట. కొండల్లో గ్యాంగ్ తో నివశించే క్రూరమైన వ్యక్తిగా సైఫ్ కనిపిస్తారని సమాచారం. కొండ పరిసర గ్రామాలపై సైఫ్ అలీ ఖాన్ కేరెక్టర్ తో అక్కడి ప్రజలు ఒణికిపోతారని, వారిపై సైఫ్ దారుణంగా వ్యవహరిస్తుందని, ఈ పాత్ర చేసే అరాచకాలు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది.
తారక్, సైఫ్ మధ్య సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో కూడా వస్తాయని తెలుస్తుంది. మొదట సముద్రానిపై ఆధిపత్యం చలాయించడానికే పరిమితమైన ఎన్టీఆర్ పాత్ర ఆ గ్రామాల ప్రజల కష్టాలను ఏ విధంగా పరిష్కరించింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.