Advertisement
Google Ads BL

మైత్రి మూవీస్ లో పని చేసిన హీరోలకి షాక్


గత ఐదు రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అలాగే ప్యాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. సుకుమార్ ఇంటిపై ఆదివారంతో ఈ దాడులు పూర్తి కాగా.. మైత్రి మూవీ మేకర్స్ పై జరిగిన సోదాలు ఈరోజుతో పూర్తి కావడంతో ఐటి అధికారులు మైత్రి మూవీలో జరిగిన లావాదేవీలు, ఈ నిర్మాణ సంస్థతో పని చేసిన, చేస్తున్న హీరోలపై ఐటి అధికారులు దృష్టి సారించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు హవాలా రూపంలో హీరోలకి, దర్శకులకి పారితోషకాలు చెల్లించినట్టుగా ఈ సోదాల్లో అధికారులు గుర్తించారు.
ముంబై కి చెందిన ఏడు కంపెనీల నుండి మైత్రి వారికి 700 కోట్లు హవాలా రూపంలో రాగా.. దానితో వారు సినిమాలపై పెట్టుబడులు పెడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. బాలీవుడ్ దర్శకుడుకి మైత్రి నిర్మాతలు 150 కోట్ల రూపాయలు ఈ హవాలా ద్వారా చెల్లించినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా గత రెండేళ్లలో ఇద్దరు బడా హీరోలకి పెద్ద మొత్తంలో అనుమానాస్పద ట్రాన్సిక్షన్స్ జరిగినట్టుగా గుర్తించారు. అలాగే ప్రస్తుతం ఓ బడా సీక్వెల్ చేస్తున్న హీరోకి కూడా ఈ హవాలా రూపంలోనే మైత్రి వారు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్టుగా అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం మైత్రి మూవీస్ తో పని చేసిన స్టార్స్ ఖాతాలను కూడా ఐటి శాఖ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ హీరోకి ఎంత పెద్ద మొత్తంలో డబ్బుని మళ్లించారనే విషయంలో ఐటి అధికారులు కూపీ లాగుతున్నారు. ముంబై కి చెందిన హీరోలని విచారణకు పిలిచే అవకాశం ఉంది అని.. ఈ హవాలాలో ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Advertisement
CJ Advs

IT officials who shocked the star heroes:

IT shock for heroes associated with Mythri Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs