Advertisement
Google Ads BL

సమంతని వదిలేదేలే.. అంటున్న నిర్మాత


ఈమధ్యన నటుడు కం ప్రొడ్యూసర్ చిట్టిబాబు హీరోయిన్ సమంతని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది, విడాకుల తర్వాత సింపతీ కోసం పాకులాడుతుంది. డివోర్స్ అవ్వగానే పుష్ప లో ఐటెం సాంగ్ లో అందాలు చూపించేసింది. ఇపుడేమో నాకు ఆరోగ్యం బాలేదు అంటూ సినిమా ప్రమోషన్స్ లో డ్రామా ప్లే చేస్తుంది అంటూ సమంతని టార్గెట్ చేసాడు. యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతపై చిట్టిబాబు చేసిన కామెంట్స్ కి సమంత కూడా ఆయన పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ వేసింది.

Advertisement
CJ Advs

చిట్టిబాబు చెవుల్లో పెరిగిన జుట్టు విషయంలో అవి అబ్బాయిల చెవుల్లో ఎలా, ఎందుకు పెరుగుతాయో అని సెర్చ్ చేసి మరీ ఆ ప్రింట్ స్క్రీన్స్ ని ఇన్స్టా స్టోరీస్ లో ఆయన పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్ కౌంటర్ ఎటాక్ చేసింది. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దానితో మండిన చిట్టిబాబు మరోసారి సమంతపై తీవ్ర విమర్శలు చేసాడు. తాను నిజాలు బయటపెడితే తట్టుకోలేవ్ అంటూ మరో కౌంటర్ వేసాడు.

ఇవన్నీ తెలివి తేటలు అనుకుంటారు. నేను మాట్లాడితే తల ఎక్కడపెట్టుకుంటావ్.. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను సమంత అని చెప్పను, నేను కౌంటర్ వేస్తే తల ఎక్కడ పెట్టుకుంటావ్.. చెవుల్లో వెంట్రుకలు గురించి మాట్లాడడం మానేసి.. నేను చేసిన వ్యాఖ్యల్లో లోపం ఎక్కడ ఉందో వెతుక్కో, దానిలో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడు.. అంటూ చిట్టిబాబు మరోసారి సమంతపై ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చూసిన నెటిజెన్స్.. అమ్మో చిట్టిబాబు సమంతని వదిలేదెలే అంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. 

Chitti Babu Strong counter to Samantha:

 Tollywood producer Chitti Babu gives strong counter to Samantha Ruth Prabhu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs