Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కి వారసురాలు?


మెగా ఫ్యామిలిలో రామ్ చరణ్ బిడ్డని ఎత్తుకోవడనికి మెగాస్టార్ చిరు అలాగే ఆయన భార్య సురేఖ ఎంతగా ఆశపడుతున్నారో.. ఉపాసన కి పుట్టబోయే బిడ్డ విషయంలో చరణ్ ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో అంతకన్నా ఎక్కువగా మెగా ఫాన్స్ తమ మెగా వారసుడికోసం ఎదురు చూస్తున్నారు. పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఆ ఆత్రుత, ఆరాటం అందరిలో ఎక్కువైపోయింది. రామ్ చరణ్ కి వారసుడు పుడతాడా.. లేదంటే వారసురాలు పుడుతుందా అనే ఇంట్రెస్ట్ కూడా అంతకంతకు ఎక్కువైపోతోంది.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవికి ముందు అమ్మాయి సుశ్మిత జన్మించింది. తర్వాతే రామ్ చరణ్, శ్రీజ పుట్టారు. ఇక సుశ్మిత, శ్రీజకి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు. అందుకే రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డపై అందరిలో ఆత్రుత మొదలయ్యింది. అటు ఉపాసన ఫ్యామిలి వాళ్ళకి అబ్బాయిలు లేరు. ఇద్దరూ అమ్మాయిలే కావడం మరింత ఆసక్తికి కారణమైంది. అయితే రామ్ చరణ్ కి జులై లో పుట్టబోయేది అమ్మాయి అని తెలుస్తుంది. 

రామ్ చరణ్-ఉపాసనలు ఆడపిల్లకి జన్మనివ్వబోతున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు, రామ్ చరణ్ కి వారసురాలు రాబోతుంది అంటూ ఆ వార్త సారాంశం. అయితే ఇక్కడ ఇండియాలో డెలివరీకి ముందు లింగ నిర్దారణ చెయ్యడమనేది చట్ట విరుద్ధం. కానీ ఉపాసన ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ కాబట్టి అలా ఏమైనా తెలిసి ఉండొచ్చేమో అని మెగా ఫాన్స్ అభిప్రాపడుతున్నారు.

Is it Baby Girl for Upasana?:

Ram Charan-Upasana to have a daughter?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs