Advertisement
Google Ads BL

సింగర్ సునీత భర్త రామ్ కి బెదిరింపులు


ప్రముఖ సింగర్ సునీత మూడేళ్ళ క్రితం మాంగో రామ్ వీరపనేనిని రెండో వివాహం చేయుకుంది. సునీత పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మొదటి భర్తకి విడాకులిచ్చి రామ్ ని రెండో పెళ్లి చేసుకున్న సునీత అప్పటినుండి ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. భర్త రామ్ తో కలిసి టాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కి, ఫంక్షన్స్, పార్టీలకి హాజరవుతుంది. తాజాగా రామ్ వీరపనేనికి లక్షణ్ అనే వ్యక్తి ఫోన్ లో నీ అంతు చూస్తాను అంటూ బెదిరించడంతో ఆయన పోలీసులని సంప్రదించారు.

Advertisement
CJ Advs

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్న రామ్-సునీతలని సినిమా నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడిని అని చెప్పుకునే లక్ష్మణ్‌ అనే వ్యక్తి ఫోన్ మెసేజెస్ తో బెదిరింపులకు దిగుతున్నాడట. తనని పర్సనల్ గా కలవాలని రామ్ కి లక్షణ్ మెసేజ్ చెయ్యగా.. అపరిచిత వ్యక్తులని కలవను అని రామ్ వెళ్లకపోవడంతో.. లక్షణ్ తరచూ మెసేజెస్ తో వేధించడంతో రామ్ అతని నెంబర్ బ్లాక్ చెయ్యడంతో లక్షణ్ మరో కొత్త నెంబర్ తో రామ్ కి కాల్స్ చేస్తూ వేధించాడట.

దానితో రామ్ తనకు తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్‌ నుంచి ప్రాణహాని ఉందని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు రామ్ ఫిర్యాదు చేశారు. 

Threats to singer Sunitha husband Ram:

Singer Sunitha husband says: His life is in danger
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs