గత శుక్రవారం విడుదలైన విరూపాక్ష పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సంపాదించుకుంది. రోజురోజుకి కలెక్షన్స్ పుంజుకుంటున్న విరూపాక్ష కి మౌత్ టాక్ బాగా హెల్ప్ అయ్యింది. అలాగే సెలబ్రిటీస్ విరూపాక్ష చేస్తున్న ట్వీట్స్ కలెక్షన్స్ పెరగడానికి కారణమయ్యాయి.
అయితే సినిమాలో సాయి ధరం తేజ్ పెరఫార్మెన్స్ కన్నా హీరోయిన్ సంయుక్త మీనన్ పెరఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఎక్కువ ఓటేస్తున్నారు. సాయి తేజ్ హెయిర్ స్టయిల్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కొన్ని సీన్స్ లో సాయి తేజ్ పట్టి పట్టి నటించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ సంయుక్త మీనన్ మాత్రం నందని కేరెక్టర్ లో పెరఫార్మెన్స్ పరంగా ఇరగదీసింది అంటున్నారు.
సూర్య కేరెక్టర్ లో సాయి తేజ్ కన్నా సంయుక్త మీనన్ కేరెక్టర్ కూడా హైలెట్ అయ్యింది, ఆమె పెరఫార్మెన్స్ కి ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. నందిని కేరెక్టర్ లో ఆమె భయపెట్టేసింది.. ఆమెది గోల్డెన్ లెగ్, సంయుక్తకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అంటూ విరూపాక్షలో ఆమె నటన గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.