Advertisement
Google Ads BL

పవన్ ఫ్యాన్ కి OG నిర్మాత బిర్యానీ పార్సిల్


ఈమధ్యన చాలామంది ఫాన్స్ ఫన్నీ కామెంట్స్ చేసినా.. నిర్మాణ సంస్థలు. ఆయా హీరోలు అభిమానుల కోరికలు తీర్చడమే కాదు.. వాళ్ళు డిమాండ్ చేసిన ప్రతిసారి సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. రీసెంట్ గా మహేష్ ఫాన్స్ డిమాండ్ చేసారని ఎలాంటి హడావిడి లేకుండా SSMB28 ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్.. తదుపరి అప్ డేట్ కోసం ముందునుండి గొడవ చెయ్యకుండా మే 31 వరకు ఓపిగ్గా ఉండమని చెప్పారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ నిర్మాణ సంస్థ దానయ్య ఎంటర్టైన్మెంట్ వారు పవన్ ఫ్యాన్ అడిగాడని అతనికి బిర్యానీ పార్సిల్ పంపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా DVV మూవీస్ వారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. సదరు నిర్మాణ సంస్థని టాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు.. OG నుంచి ఓ బిర్యానీ ప్లాన్ చెయ్ అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. దానితో OG నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. డీఎంలో అతని అడ్ర‌స్ పోస్ట్ చేయ‌మ‌ని కోరింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెంటనే అడ్రెస్స్ పోస్ట్ చేసాడు. కొంత సేప‌టికి అతనికి హైదరాబాద్ మెరిడియ‌న్ రెస్టారెంట్ బిర్యానీ అందింది.

ఈ విష‌యాన్ని పవన్ ఫ్యాన్ షేర్ చేస్తూ డివివి మూవీస్‌కి థాంక్స్ చెప్పడమే కాకుండా ప‌వ‌న్ అన్నని కూడా ఇంతే ప్రేమగా, జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని కూడా కోరాడు. ఇప్పడిదంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

OG Producer Biryani Parcel for Pawan Fan:

Pawan Kalyan fan demands biryani DVV entertainments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs