Advertisement
Google Ads BL

గ్లామర్ షో పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది


శ్రీయ శరన్ కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ డాల్ గా, పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్న శ్రీయ శరన్ ఆ తరవాత బాడీ షేకిమింగ్ కి భయపడి గుట్టు చప్పుడు కాకుండా బిడ్డని కని అందరికి షాకిచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఇంకా ఇంకా సినిమా ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే ఉంది. 

Advertisement
CJ Advs

అందాలు ఆరబొయ్యడమే కాదు.. బాడీని బరువు తగ్గించి స్లిమ్ లుక్ లోకి మార్చేసింది. అయితే శ్రీయ గ్లామర్ షో కేవలం సినిమా అవకాశాల కోసమే అనేది అందరికి తెలిసిన రహస్యమే. మితిమీరిన గ్లామర్ షోతో శ్రీయ శరన్ సీనియర్ హీరోల అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. కాని ఆ హీరోలేమో కాజల్, శృతి హాసన్ లాంటి వాళ్లతో ఆడిపాడేస్తున్నారు తప్ప శ్రీయని పిలిచి అవకాశాలు ఇవ్వడం లేదు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఇలా ఆందరూ ఆమెని దూరం పెట్టేసారు. 

అయినా శ్రీయ తన ప్రయత్న లోపం లేకుండా గ్లామర్ గా అందాలు ఆరబోసే విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. దాని ఫలితమే శ్రీయకి 20 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట. చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చినట్లుగా  తెలుస్తుంది. అప్పట్లో ఠాగూర్ లో చిరు-శ్రీయ కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఐటమ్ సాంగ్ తో కలుస్తున్నారు. ఈ ఆఫర్ శ్రీయకి రావడానికి కారణం ఆమె సోషల్ మీడియా అందాలే అని చెప్పుకుంటున్నారు.

Actress Shriya Saran will do special song in Bhola Shankar:

Shriya Saran to do Special Song  in Chiranjeevi Bhola Shankar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs