జబర్దస్త్ పంచ్ లతో ఫెమస్ అయ్యి టీమ్ లీడర్ గా ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్ పై టీమ్ ని లీడ్ చేసిన తర్వాత జబర్దస్త్ నుండి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని సిల్వర్ స్క్రీన్ మీద అదృష్టాన్ని పరీక్షించుకున్న చలాకి చంటి.. స్టార్ మా బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింతగా దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో కొన్ని సమయాల్లో ఇబ్బంది పడ్డాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన చలాకి చంటి బిగ్ బాస్ తర్వాత మళ్ళీ పెద్దగా కనిపించింది లేదు.
తాజాగా చలాకి చంటి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు రావడం చూసిన ఆయన అభిమానులు ఆందోళ పడుతున్నారు. చలాకి చంటికి గుండెపోటు రావడంతో ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ అసూయాపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు, ప్రస్తుతం చంటిని ICU లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా వస్తున్న వార్తలతో ఆయన అభిమానుల్లో ఆందోళ ఎక్కువైంది.
అయితే చంటి నిజంగానే గుండెపోటు వచ్చిందా.. ఆయన సీరియస్ కండిషన్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా అనే విషయంలో అధికారిక సమాచారం లేదు. అసలు అది నిజమా.. లేదంటే రూమరా అనేది తెలియరావడం లేదు. దానితో అభిమానుల్లో అయోమయం ఏర్పడింది.