బాలీవుడ్ లో స్టార్ హీరోలకి టైమ్ బాగోలేదో.. సౌత్ హీరోల టైమ్ బావుందో కానీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలంతా డిజాస్టర్స్ కొట్టుమిట్టాడుతున్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా దెబ్బకి కామైపోయారు. కొద్దిరోజులు సినిమాలకే బ్రేక్ ఇచ్చి విశ్రాంతి అన్నారు. ఇక అక్షయ్ కుమార్ సెల్ఫీ భారీ డిసాస్టర్. అజయ్ దేవగన్ భోళా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. రన్వీర్ సింగ్ కూడా సర్కస్ డిసాస్టర్ తో సైలెంట్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ కొన్నేళ్ల తర్వాత పఠాన్ తో ప్రభంజనం సృష్టించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా పరిస్థితి అదే విధంగా అయింది.
రంజాన్ స్పెషల్ గా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీసుకి ఘోర పరాభవాన్ని మిగిల్చేలా కనిపిస్తుంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ చూస్తే ఈ చిత్రం కూడా ప్లాప్ లిస్ట్ లో చేరడం ఖాయమనేలా ఉంది. దానితో సల్మాన్ పై ట్రోలింగ్ మొదలైపోయింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలంతా గప్ చుప్ గా కనబడుతున్నారు. అమీర్ దగ్గర నుండి సల్మాన్ ఖాన్ వరకు ఇలా వరసగా అందరూ డిజాస్టర్స్ ఊబిలో కొట్టుకుంటున్నారు.
ఇటు చూస్తే సౌత్ ఇండస్ట్రీ రోజు రోజుకి కొంత రికార్డులను సృష్టించడానికి రెడీ అవుతుంది. సౌత్ నుండి వరస సినిమాలు బాలీవుడ్ ని షేక్ చెయ్యడం అక్కడి హీరోలకి మింగుడుపడడం లేదు. జస్ట్ యాక్షన్ చేస్తే చాలు ఆడియన్స్ ఆదరిస్తారనే భ్రమ నుండి బయటపడి కొత్త కథలతో ట్రై చేస్తే ఫలితముంటుంది అంటూ నెటిజెన్స్ సలహాలతో వారు మరింతగా రగిలిపోతున్నారు.