అప్పుడెప్పుడో నిర్మాతగా చేసి.. ప్రస్తుతం నటుడిగా కనిపిస్తూనే టివి ఛానల్స్ డిబేట్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ ఉండే చిట్టిబాబు రీసెంట్ గా సమంతపై ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై సమంత అభిమానులు ఫైర్ అవుతున్నారు. నాగ చైతన్య తో విడిపోయి ప్రమోషన్స్ లో తనకి ఆరోగ్యం బాగోలేదంటూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ క్యాష్ చేసుకుంటుంది. శాకుంతలం డిసాస్టర్ తో సమంత కెరియర్ ముగిసిపోయిందని, కేవలం సినిమాలను ప్రమోట్ చేసేకునేందుకు ఆస్పత్రిలో ఉన్నట్లుగా, ఆరోగ్యం బాగా లేదని చెబుతూ సింపతీ గేమ్స్ ఆడుతుంది.. ఇప్పుడు సమంత అస్సలు అందంగా లేదు అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు.
అయితే చిట్టిబాబు వ్యాఖ్యలుపై సమంత లేటెస్ట్ గా ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసింది. సమంత తాజాగా ఇన్స్టా స్టోరీస్ లో కొంతమంది వ్యక్తుల చెవులలో జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ లో సెర్చ్ చేసి మరీ దానిని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. అంటే చిట్టిబాబు తల మీద కన్నా ఎక్కువగా చెవుల్లో హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో సమంత స్క్రీన్ షాట్ తీసి పెట్టింది అతనిని ఉద్దేశించే అనే అనుమానాలు అందరిలో కలిగాయి.
అయితే ఇలా చెవులలో నుంచి వెంట్రుకలు బయటకు రావడానికి టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండటం వల్ల అని ఉంది. దీనికి ఇఫ్ యు నో.. యు నో అంటూ స్టోరీస్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సమంత ఖచ్చితంగా ఈ పోస్ట్ చిట్టిబాబుని ఉద్దేశించే పెట్టింది అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.