Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ OG బ్యాక్ డ్రాప్ రివీల్డ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడుకి పవన్ ఫాన్స్ లో ఆనందం తాండవడం చేస్తుంది. ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఆయన ఇంత స్పీడుగా సినిమా షూటింగ్స్ చెయ్యడం అనేది వారి కల. కల నెరవేరుతుంటే ఆ ఆనందం పట్టలేకపోతున్నారు. సరదాగా, స్లోగా సినిమాలు చేసే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల టార్గెట్ సమయానికి షూటింగ్స్ కంప్లీట్ చేసే మోడ్ లో ఏకంగా నాలుగుసినిమాల సెట్స్ మీద సవారి చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో సుజిత్ దర్శకత్వంలో OG సెట్స్ లో ఉన్నారు.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కాంబో సీన్స్ చిత్రీకరణలో సుజిత్ ఉన్నారు. అయితే సుజిత్ OG షూటింగ్ స్టార్టింగ్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లుక్ లో కనిపిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమా నేపథ్యం ఏమిటో రివీల్ అయ్యింది. OG కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. ఖరీదైన కార్లు, ఛేజింగులు, భారీ ఫైట్స్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ సన్నివేశాలను సుజిత్ భారీగా డిజైన్ చేసాడట. అందుకే షూటింగ్ కూడా ముంబై పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేసుకున్నాడు.

హాలీవుడ్ రేంజ్ లోనే భారీ యాక్షన్ సీన్స్ OG లో ఉండబోతున్నాయట. ఇంతకుముందు పవన్ కల్యాణ్ ను ఎవరూ చూపించని గెటప్ లో ఈ సినిమాలో సుజీత్ చూపించనున్నాడని తెలుస్తుంది. సుజిత్ ఓపెనింగ్ ప్రోమో తోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు. ఇకపై ఆ సినిమాపై ఏ అప్ డేట్ వచ్చినా అది రికార్డులని క్రియేట్ చెయ్యడం ఖాయంగా కనబడుతుంది. 

Pawan Kalyan OG Backdrop Revealed:

Mumbai backdrop for Pawan Kalyan OG
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs