Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ప్లాన్ అదిరిందిగా!


అల్లు అర్జున్ నార్త్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే ఏ చిన్న అవకాశాన్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే యూట్యూబ్ లో సరైనోడు లాంటి చిత్రాలతో నార్త్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన అల్లు అర్జున్ పుష్ప ద రైజ్ తో వాళ్ళ హృదయాలకి బాగా దగ్గరయ్యాడు. ఆ చిత్రం హిందీలోనే 100 కోట్ల కలెక్షన్స్ సునామి సృష్టించడంతో అల్లు అర్జున్ క్రేజ్ హిందీలో ఏమేర పెరిగిందో పూర్తిగా అర్ధమైంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ సంజయ్ లీల భన్సాలీతో జట్టుకడతాడనుకుంటే.. తెలుగు నుండి వెళ్లి బాలీవుడ్ లో సత్తా చాటుతున్న సందీప్ రెడ్డి వంగతో సినిమా ప్రకటించాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా అల్లు అర్జున్ షారుఖ్ జవాన్ లో క్యామియో చేయబోతున్నాడనే న్యూస్ నడిచినా దానిపై క్లారిటీ లేదు. జవాన్ మూవీలో ఒక గెస్ట్ రోల్ కోసం అల్లు అర్జున్‌ను సంప్రదిస్తే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు రూమర్స్ వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ జవాన్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ నెల రోజుల క్రితమే ఓసారి ముంబై వెళ్ళాడు. అయన అప్పుడు ముంబైలో జవాన్ సెట్‌లో ఉన్నాడని, తన రోల్‌కు సంబంధించి షూటింగ్ కూడా అప్పుడే కంప్లీట్ చేసి వచ్చాడంటూ బాలీవుడ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 

ఈ విషయం చూసిన అల్లు ఫాన్స్ ఎగ్జైట్ అవుతుండగా.. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అల్లు అర్జున్ నార్త్ ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నాడని, హిందీ మార్కెట్ లో తన రేంజ్ పెరగాలంటే అక్కడి స్టార్ హీరోలతో మంచి రాపో మెయింటింగ్ చెయ్యాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇది చూసిన నెటిజెన్స్ అల్లు అర్జున్ ప్లాన్ నిజంగానే అదిరిపోయిందిగా అని కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun Already Finished Shooting For SRK Film!:

Allu Arjun joins forces with Shah Rukh Khan for a cameo in Jawan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs