Advertisement
Google Ads BL

ఫోన్ పోగొట్టుకున్న విరూపాక్ష దర్శకుడు


నిన్న శుక్రవారం థియేటర్స్ లో విడుదలై హిట్ టాక్ తో క్రేజీగా దూసుకుపోతున్న సాయి ధరం తేజ్ విరూపాక్ష మూవీని సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసాడు. చేసింది ఫస్ట్ మూవీనే అయినా.. ప్రేక్షకులని హర్రర్ తో భయపెట్టేసాడు, కుర్చీల్లో కూర్చోబెట్టేసాడు. విరూపాక్ష మూవీకి పబ్లిక్ సపోర్ట్ దొరకడంతో సాయి తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ విరూపాక్ష కొల్లగొట్టింది. కార్తిక్ దండు దర్శకత్వాన్ని పొగిడే వారే కానీ పొగడని వారే లేరు. 

Advertisement
CJ Advs

సాయి తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంత న్యాయం చేసారో.. కార్తిక్ దండు మేకింగ్ స్టయిల్ అంతే బావుంది అంటున్నారు. అయితే ప్రేక్షకులు స్పందన, పబ్లిక్ టాక్, సెలబ్రిటీస్ ప్రయిస్, మెగాస్టార్, పవర్ స్టార్ మెచ్చుకోవడం ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు థియేటర్స్ లో ఆడియన్స్ రచ్చ ఎలా ఉందొ ప్రత్యక్షంగా చూద్దామని దర్శకుడు కార్తీక్ దండు థియేటర్స్ విజిటింగ్ అంటూ తన టీం తో బయలుదేరగా.. ఆ రచ్చలో, ప్రేక్షకుల సందడిలో థియేటర్స్ లో కార్తీక్ దండు ఫోన్ కొట్టేశారట ఎవరో. ఈ విషయాన్ని ఆయనే ప్రెస్ మీట్ లో బయటపెట్టాడు.

సినిమా చూడడానికి వచ్చినవారెవరో కార్తిక్ దండు జేబులో ఫోన్ ఎత్తెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వగా.. మొదటి సినిమాకే ఫోన్ పోగొట్టుకున్న దర్శకుడు, అయ్యో సినిమా సినిమానే దొంగల పని దొంగలదే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Director Karthik Dandu Lost his Phone in Theater:

Director Karthik Dandu Lost his Phone in Virupaksha Theater
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs