Advertisement
Google Ads BL

సీనియర్ యాక్టర్ శరత్ బాబు హెల్త్ అప్ డేట్


సీనియర్ యాక్టర్ శరత్ బాబు హీరోగా, విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్నేళ్ల ముందు వరకు సినిమాల్లో కనిపించేవారు. కానీ కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న శరత్ బాబు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే కానీ.. ఆయన హెల్త్ పై సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా శరత్ బాబు పై హెల్త్ అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.

Advertisement
CJ Advs

నిన్న శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్ గా మారగా ఆయన్ని ఫ్యామిలీ మెంబెర్స్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడం జరిగిందట. హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రి ఏఐజి లో ఆయన్ని జాయిన్ చెయ్యగా డాక్టర్స్ బృందం ఆయనకి ఐసియూలో అడ్మిట్ చేసి చికిత్స అందించినట్లుగా సమాచారం. చికిత్స అనంతరం ఇపుడు ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుట పడడంతో ఆయన్ని ఈరోజు శనివారం ఉదయం ఐసియూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుత శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే శరత్ బాబు అనారోగ్యం పై కుటుంబ సభ్యులు కానీ డాక్టర్స్ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

Senior Actor Sarath Babu Health Update:

Senior Actor Sarath Babu Hospitalized suddenly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs