Advertisement
Google Ads BL

మెగాస్టార్ ప్రశంసలు అందుకున్న సాయి తేజ్!


సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదట్నుంచీ పాజిటివ్ బజ్‌తో కొనసాగుతున్న ఈ చిత్రం విడుదలైన మార్నింగ్ షో నుండే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని టాక్‌ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్తమీనన్ నటించింది. 

Advertisement
CJ Advs

కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో యువ నిర్మాత బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో  సక్సెస్‌ఫుల్ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిస్ట్రీక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు హీరోలు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి, హీరో సాయిధరమ్‌తేజ్‌కు, చిత్ర యూనిట్‌కు తన అభినందనలు తెలియజేశారు. 

విరూపాక్ష చిత్రంకు వస్తున్న అద్బుతమైన స్పందన చూస్తుంటే ఆనందంగా వుంది. సాయిధరమ్‌తేజ్ మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ విజయంతో ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీగా వుంది.  విరూపాక్ష చిత్రానికి ఆడియన్స్ ప్రశంసలు, అభినందనలు అందించడం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, టోటల్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

Chiranjeevi congratulatory wishes for Sai Dharam Tej :

Megastar Chiranjeevi congratulatory wishes for Sai Dharam Tej on the Blockbuster success of Virupaksha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs