Advertisement
Google Ads BL

ఐటి ఎఫెక్ట్: పుష్ప 2 షూట్ నిలివేత ?


పుష్ప దర్శకుడు, నిర్మాతల ఇళ్ళు, ఆఫీస్ లపై గత రెండు రోజులుగా జరిగిన ఐటి సోదాలతో పుష్ప ద రూల్ షూటింగ్ ఆగిందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. గత నాలుగు రోజులుగా ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలోని ఫారెస్ట్ ఏరియాలో పుష్ప2 షూటింగ్ జరుగుతుంది. అయితే రెండు రోజులుగా ఐటి అధికారులు దర్శకుడు సుకుమార్, పుష్ప నిర్మాతలు పై దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఐటి దాడుల ఎఫెక్ట్ పుష్ప ద రూల్ షూటింగ్ పై పడింది అంటున్నారు.

Advertisement
CJ Advs

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సదరు నిర్మాణ సంస్థకు పెట్టుబడులు ఎక్కడనుండి వస్తున్నాయనే దాని మీదే ఐటి అదికారులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. రూల్స్‌ను అతిక్ర‌మించి విదేశీ నిధులను సినిమాల బడ్జెట్ కి మళ్లించడమే కాకుండా హైదరాబాద్ నగర శివార్లలో శంకరపల్లి, మొయినాబాదు లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు కొనుగోలు చేస్తున్నట్లు.. వందల ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది.

సుకుమార్ కూడా ఆ నిర్మాణ సంస్థలో భాగమైనందునే సుకుమార్ ఇల్లు, ఆఫీస్ పై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించారని.. దానితో సుకుమార్ పుష్ప 2 షూటింగ్ కి ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తుంది.

IT rides Effect: Pushpa 2 shoot halted?:

Sukumar Stopped Allu Arjun Pushpa 2 shooting 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs