Advertisement
Google Ads BL

ఇస్మార్థ్ శంకర్ కాంబో రిపీట్


ఇస్మార్ట్ శంకర్ ముగ్గురుకి కమ్ బ్యాక్ మూవీ.. డిజాస్టర్ లిస్ట్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఈ చిత్రంతో పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వగా.. హీరో రామ్ ని మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన మూవీ. అటు పూరి-ఛార్మికి నిర్మాతలుగా నిలబెట్టిన చిత్రమిది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మని మళ్ళీ ఫామ్ లోకి తెచ్చిన ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ అనే వార్త అటు రామ్ ఫాన్స్ లోను, ఇటు పూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ద వారియర్ డిసాస్టర్ తరవాత బోయపాటితో పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్.. తన తదుపరి మూవీ పూరి దర్శకత్వంలోనే చెయ్యబోయే ఛాన్స్ ఉందట.

Advertisement
CJ Advs

లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేద్దామనుకుని బొక్కబోర్లా పడిన పూరి జగన్నాథ్ ఆ దెబ్బకి ఇప్పటివరకు సైలెంట్ మోడ్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఛార్మితో కలిసి ముంబైలో కొన్నాళ్లుగా మకాం వేసిన పూరి జగన్నాథ్ ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కథని ప్రిపేర్ చేసుకుని డెవెలెప్ చేస్తూ.. రామ్ తో మీటింగ్ మొదలెట్టినట్టుగా టాక్. పూరి-ఛార్మినే పూరీ కనెక్ట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారట.

లైగర్ తర్వాత చెయ్యాల్సిన జన గణ మన కి మంగళం పాడేసిన పూరి మరోసారి రామ్ తో సినిమా అంటే అంచనాలు బాగానే ఉంటాయి. అందులోను పూరీకి ఎన్ని డిజాస్టర్స్ ఉన్నా ఆయన సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అలర్ట్ అవుతారు. సో అతి త్వరలోనే ఇస్మార్థ్ శంకర్ కాంబోపై ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Ismart Shankar Combo Repeat:

This mass combination from Puri Jagan to repeat soon?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs