Advertisement
Google Ads BL

విరూపాక్ష మ్యానియాలో సోషల్ మీడియా


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ చిత్రం విరూపాక్ష నేడు శుక్రవారం ఏప్రిల్ 21 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. రిపబ్లిక్ తర్వాత, సాయి తేజ్ రోడ్ యాక్సిడెంట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందులోను వేసవి సెలవల్లో విడుదలవుతున్న మొదటి మూవీ కూడా విరూపాక్ష కావడంతో స్టూడెంట్స్ అంతా థియేటర్స్ కి పరుగులు తీసేందుకు రెడీ అయిన సమయమిది. సాయి తేజ్ పై ఉన్న సింపతీ, అలాగే సినిమా ప్రమోషన్స్ అన్ని సినిమాపై గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. సోషల్ మీడియాలో సాయి తేజ్ విరూపాక్షతో హిట్ కొట్టాలని ఆయనకి ఆల్ ద బెస్ట్ చెబుతూ చేస్తున్న ట్వీట్స్ తో నిండిపోయింది.

Advertisement
CJ Advs

స్టార్ సెలబ్రిటీస్ అంతా సాయి తేజ్ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తుంటే.. మీడియా మొత్తం సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో హిట్ కొట్టేసాడు, విరూపాక్షకి బ్లాక్ బస్టర్ టాక్ ఇస్తూ సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టారు. ఈ చిత్రంతో సాయి తేజ్ కి కమ్ బ్యాక్ పడిపోయింది అంటూ ఆయన ఫాన్స్, ఓవర్సీస్ రివ్యూస్, ట్విట్టర్ రివ్యూస్, విరూపాక్ష ఫస్ట్ టాక్, విరూపాక్ష ఫస్ట్ హాఫ్ రివ్యూ.. అబ్బో ఇలా సోషల్ మీడియా మొత్తం విరూపాక్షనే ట్రెండ్ అవుతుంది.

ప్రముఖ వెబ్ సైట్స్ లో సాయి తేజ్ విరూపాక్ష ఫస్ట్ రివ్యూస్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. మెగా ఫాన్స్ మెగా మేనల్లుడి విరూపాక్షతో హిట్ కొట్టాడంటూ టపాసులు పేలుస్తున్నారు. #SaiDharamTej #Virupaksha హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ సందడి చేస్తున్నారు. #Virupaksha Blockbuster bomma 🔥🔥 షో టైమ్ అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

ఈరోజు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మ్యానియాతో సోషల్ మీడియా తడిచి ముద్దవుతుంది. మరికాసేపట్లో సినీ విశ్లేషకుల రివ్యూస్ తో మరో హడావిడికి రెడీ అవ్వబోతుంది సోషల్ మీడియా.

Social media in Virupaksha mania:

Sai Dharam Tej starrer Virupaksha gets good openings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs